Kasipet Mandal News:-
బొగ్గు గనుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కాసిపేట
మైన్ పై ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం 500 బొగ్గు బావులను ప్రైవేటీకరించి, పారిశ్రామిక వేత్తల చేతిలో పెట్టె ప్రయత్నం చేస్తుందని ఏఐటీయూసీ ఇంచార్జ్ చిన్న నర్సయ్య అన్నారు. కార్మికులకు హక్కులు కల్పించాల్సింది పోయి ఒక్కొక్కటిగా వాటిని హరిస్తుందని, ఇప్పుడు ఏకంగా సింగరేణి మొత్తం ప్రైవేటీకరించే కుట్ర చేస్తుందని ఆయన వాపోయారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు దాగం మల్లేష్, బియ్యాల వెంకటస్వామి, మినుగు లక్ష్మినారాయణ, నర్సయ్య, రవీందర్ తదితరులు ఉన్నారు.