Mancherial District News:-
మంచిర్యాల జిల్లాలో తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదయింది. చెన్నూరు మండలంలోని ముత్తరావుపల్లి గ్రామానికి చెందిన మహిళకు వారం కిందట ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఆమెను హైదరాబాద్ హాస్పటల్ కు తరలించారు. ఈనెల 14వ తేదీన ఆమె చికిత్స పొందుతూ చనిపోయింది. అప్పటికే టెస్ట్ లకు పంపిన రక్త నమూనాలో ఆమెకు కరోనా పాజిటివ్ అని తేలడంతో ముత్తరావుపల్లిలో అధికారులు హైఅలర్ట్ ప్రకటించారు. చనిపోయిన మహిళతో కాంటాక్ట్ లో ఉన్న వ్యక్తులను గుర్తించే పనిలో అధికారులు ఉన్నారు.