- కరోనా వైరస్ పై అవగాహనా
Kasipet Mandal News:-
కాసిపేట మండల కేంద్రంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంక్ వద్ద డోక్రా మహిళలకు మరియు బ్యాంక్ కి వచ్చిన వారికీ మాస్క్ లను ప్రజాప్రతినిధులు అందజేశారు. కరోనా వైరస్ లక్షణాలను, మరియు వైరస్ ఎలా వ్యాప్తి చెందుతుందో ప్రజలకు తెలియజేసారు. ప్రతి ఒక్కరు మాస్క్ కచ్చితంగా వాడాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఆడే బాదు గారు, ఉపసర్పంచ్ బోయిని తిరుపతి గారు, వార్డ్ మెంబెర్ సందీప్ గారు, తెరాస ప్రధాన కార్యదర్శి మోటూరి వేణు గారు, బ్యాంక్ మేనేజర్ మరియు సిబ్బంది తదితరుల పాల్గొన్నారు.