Kasipet Mandal News:-
కాసిపేట మండలంలోని కుర్రేఘడ్ మరియు
వెంకటాపూర్ గ్రామాలలో క్రి శే జాడి పెద్ద పోచయ్య మరియు క్రి శే జాడి చొక్కయ్య గార్ల జ్ఞాపకార్థం జాడి చొక్కయ్య గారి కుమారుడు జాడి రమేష్ కుమార్ (ZP HM, లోకేశ్వరం), కుటుంబ సభ్యులు జాడి రాంచందర్, జాడి శ్రీనివాస్ ఈ రోజు పేదలకు బియ్యం, నిత్యావసర సరుకులను పంపిణి చేసారు. లాక్ డౌన్ కారణంగా పేద ప్రజలు ఎదుర్కుంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని వారికీ తమ వంతు సహాయం చేసినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో వెంకటాపూర్ సర్పంచ్ ఆడే సౌందర్య-శంకర్, జాడి రాంచందర్, జంజిరాల తిరుపతి, జాడి శ్రీనివాస్, శ్రీహరి, రాజ్ కుమార్, అభిలాష్, సాయికిరణ్, రాంజీ, ప్రవీణ్, అవినాష్, కార్తీక్ పాల్గొన్నారు.