Kasipet Mandal News:-
కాసిపేట మండలంలోని అడవి సమీప ప్రాంత ప్రజలు లాక్ డౌన్ కారణంగా అటవీ సిబ్బంది కొరత ఉండడంతో ఇదే అదునుగా భావించి అడవిలోని చెట్లను నరుకుతున్నారు. ఈ నేపథ్యంలో మద్దిమడ అడవి ప్రాంతంలో సంచరిస్తున్న నలుగురు యువకులను అటవీ శాఖ డివిజన్ అధికారి ముజారుద్దిన్ గారు అదుపులోకి తీసుకున్నారు. మరోసారి ఇలా అడవి ప్రాతాలలో గొడ్డలి పట్టుకొని తిరిగితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.