Kasipet Mandal News:-
కాసిపేట్ మండలంలోని నాయకపు గూడా గ్రామంలో పెద్దనపల్లి ఎంపీటీసీ కొండాబత్తుల రాంచందర్ గారు ఈరోజు 100 పేద కుటుంబాలకు కూరగాయలు అందజేశారు. కరోనా కారణంగా బయటికి రాలేక పోతున్న గ్రామ ప్రజల పరిస్థితి చూసి ఇంటింటికి వెళ్లి కూరగాయలు ఇవ్వడం జరిగిందని అయన అన్నారు. ఈ కార్యక్రమంలో కాసిపేట ఎస్ఐ రాములు గారు, జడ్పీటీసీ పల్లె చంద్రయ్య గారు, ఎంపీటీసీ కొండాబత్తుల రాంచందర్ గారు, ముత్యంపల్లి ఉపసర్పంచ్ బోయిని తిరుపతి యదావ్ గారు, భూక్యా రాంచందర్ గారు, డాక్టర్ భీమయ్య, వంశీ, నవీన్, బీరయ్య, ధర్మాజీ తదితరులు పాల్గొన్నారు.
సోమగుడెం(కే) గ్రామ పంచాయతీ పరిధిలో భగత్ సింగ్ యువజన సంఘం ఆధ్వర్యంలో 50 పేద కుటుంబాలకు కూరగాయలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సి పి ఎం జిల్లా కార్యదర్శి సంకే రవి, భగత్ సింగ్ యూత్ అధ్యక్షుడు కనుకుల రాకేష్, ప్రధాన కార్యదర్శి చిలుముల శ్రీనివాస్, కార్యదర్శి అజ్మిర శ్రీనివాస్, ముఖ్య సలహాదారులు అజ్మిర రాజ, జంజీరాల శ్రీనివాస్, యూత్ నాయకులు ధరవత్ తిరుపతి, భుక్య పున్నం, కిరణ్, అనగందుల వినోద్, ఉప్పులేటి సాగర్, రవీందర్ లు పాల్గొన్నారు.