Kasipet Mandal News:-
టాస్క్ ఫోర్స్ సీఐ కిరణ్ గారు కాసిపేట మండలం
దేవపూర్ కేంద్రంలోని ఏనుగు జైపాల్ రెడ్డి అనే వ్యక్తి ఇంటి పరిసరాలలో పక్కా సమాచారం మేరకు ఆకస్మిక తనిఖీ చేయగా వారి ఇంటి ఆవరణలో 5 కాటన్ లలో 51 కింగ్ ఫిషర్ బీర్ లు స్వాధీనం చేసుకున్నారు.
నిందితుడిని విచారించగా ప్రభుత్వం కరోనా వైరస్ ఎఫెక్ట్ తో కర్ఫ్యూ విధించడంతో మద్యం షాపులను, బార్లను ఏప్రిల్ 15వ తేదీ వరకు మూసివేయాలన్న నిబంధనలు ఉండడంతో మద్యం దొరకడం చాలా ఇబ్బందిగా మారింది. దీంతో ఈ సమయంలో మద్యం అమ్మకాలు జరిపితే భారీ మొత్తంలో లాభాలు సంపాదించవచ్చని ఉద్దేశంతో మండలం లోని కొంతమంది వైన్ షాపు యజమానుల తో ఒప్పందం కుదుర్చుకొని కొంత మొత్తంలో మద్యం నిల్వలు తెప్పించుకున్నానని, వాటిని ఎక్కువ ధరకు అమ్మడం వలన అధిక లాభాలను గడించవచ్చు అనే ఉద్దేశంతో ఇలా చేశానని తెలిపాడు. టాస్క్ ఫోర్స్ పోలీసులు తదుపరి విచారణ కొరకు దేవాపూర్ ఎస్ఐ దేవయ్య గారికి అప్పగించారు.