Kasipet Mandal News:-
తెలంగాణ ప్రభుత్వం రేషన్ లబ్దిదారులకు
1,500 రూపాయలు వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసినారు. బ్యాంకు ఖాతాల్లో పడిన డబ్బులు తీసుకోకుంటే ఖాతా నుండి కట్ అవుతాయేమోనని అపోహతో కొందరు, డబ్బులు పడ్డాయో లేదో అని మరికొందరు ఇలా పెద్దసంఖ్యలో మహిళలు ముత్యంపల్లి తెలంగాణ గ్రామీణ బ్యాంకు ముందు బారులుతీరారు. అందరు సామాజిక దూరం పాటించాలని కాసిపేట్ ఎస్ఐ రాములు గారు, ముత్యంపల్లి సర్పంచ్ ఆడే బాదు గారు, మరియు ఉపసర్పంచ్ బోయిని తిరుపతి గారు ప్రజలకు అవగాహనా కల్పించారు. ఉపసర్పంచ్ బోయిని తిరుపతి గారు ఎండలో లైనులో ఉన్న ప్రతి ఒక్కరికి వాటర్ పాకెట్స్ ని అందజేశారు. మన వంతు సహాయం వాట్సాప్ గ్రూప్ సభ్యులు మహేందర్, సాయి కిరణ్, నవీన్ మరియు సాయి వోచర్లు రాస్తూ ప్రజలకు సహాయం చేశారు.