Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

మండలంలో తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవం

Kasipet Mandal News:-
కాసిపేట మండలంలో ఈరోజు తెలంగాణ రాష్ట్ర
సమితి పార్టీ 20వ ఆవిర్భావ దినోత్సవాన్ని తెరాస నాయకులు నిర్వహించారు. గ్రామాలలో స్థానిక నాయకులు పార్టీ జండాను ఎగరేశారు. కాసిపేట మండల కేంద్రంలో TRS పార్టీ మండల అధ్యక్షులు రమణ రెడ్డి గారు పార్టీ జండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రొడ్డ లక్ష్మి, జెడ్పీటీసీ పల్లె చంద్రయ్య, వైస్ ఎంపీపీ విక్రమ్ రావు, కాసిపేట సర్పంచ్ దేవి కొండయ్యా, ముత్యంపల్లి సర్పంచ్ ఆడే బాదు, ఎంపీటీసీ బుగ్గ లక్ష్మీ, మాజీ జెడ్పీటీసీ రౌతు సత్తయ్య, ఉప సర్పంచ్ సుమన్, బోయిని తిరుపతి, నాయకులు అగ్గి సతీష్, అగ్గి స్వామి, రాజేశం తదితరులు పాల్గొన్నారు.

Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App