Kasipet Mandal News:-
కాసిపేట మండలంలోని కోనూర్, తంగెళ్లపల్లి, గోండుగూడ, లంబాడితండా, బుగ్గగుడ, పల్లంగుండా గ్రామాలలో ఈరోజు ఆచార్య మూర్తి వెల్ఫేర్ సొసైటీ వారు గ్రామంలోని పేదలకు బియ్యం మరియు కూరగాయలను అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవాపూర్ ఎస్ఐ దేవయ్య గారు పాల్గొన్నారు. ఎస్ఐ గారు మాట్లాడుతూ ఆచార్య మూర్తి వెల్ఫేర్ సొసైటీ సభ్యులు వాళ్ళ ఉపాధ్యాయుని పేరుమీద ట్రస్ట్ ని ఏర్పాటు చేసి ట్రస్ట్ ద్వారా సమాజానికి ఉపయోగపడే మంచి పనులు చేయడం సంతోషంగా ఉందన్నారు. లాక్ డౌన్ కారణంగా చాలామంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, వారికీ సొసైటీ ద్వారా సహాయం చేయడం అభినందనీయం అని అన్నారు.