Kasipet Mandal News:-
కాసిపేట మండలం చిన్న ధర్మారం గ్రామానికి చెందిన షేక్ పాషా (దినసరి కూలి) లాక్ డౌన్ వల్ల పనులు లేకపోవడంతో ఆర్థిక ఇబ్భదులు పడుతున్నాడు. అతనికి 8 నెలల పాప ఉంది, పాపకి పాలు కొనలేని పరిస్థితి ఏర్పడడంతో ఈ విషయం తెలిసిన స్పందన సొసైటీ వారు విరాళాలు సేకరించి అందజేశారు. ఈ కార్యక్రమంలో కాసిపేట ఎస్ఐ రాములు గారు కూడా పాల్గొని తనవంతుగా 500 రూపాయలు అందజేశారు. అలాగే పెద్దదర్మారం గ్రామానికి చెందిన షేక్ జమీల్ కి ఈ మద్యనే కట్టేలు కొడుతుండగా కన్ను కోల్పోవడంతో అతనికి కూడా స్పందన సొసైటీ వారు ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో కాసిపేట స్పందన యుాత్ ఉపాధ్యక్షులు రాజ్ కుమార్, రంజిత్ కుమార్, కార్యదర్శి షారుక్, ప్రచార కార్యదర్శి పోలగాని రాజు, సభ్యలు ఆవుల రాజు, నలిగేటి నరేష్, వేల్పుల అనిల్, బిజెపి నాయకులు పోషన్న పాల్గోన్నారు.