Kasipet News/Somagudem:-
కాసిపేట మండలం సోమగుడెం(కె) గ్రామపంచాయతీ లో గురువారం సర్పంచ్ సపట్ శంకర్ గారు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులను ప్రారంభించారు .ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కరోన వైరస్ నియంత్రణలో భాగంగా లాక్ డౌన్ కేంద్రప్రభుత్వం ప్రకటించినప్పటికీ నిరుపేదలకు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉపాధి పనులకు అవకాశం కల్పించడం చాలా హర్షణీయం అని అన్నారు. ప్రతి ఒక్క కూలి మాస్కులు ధరించి, సామాజిక దూరం పాటించి ఎలాంటి ప్రమాదం జరగకుండా పని చేసుకోవాలి ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో టిఏ వెంకటేష్ గారు, ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు.