Kasipet Mandal News:-
కాసిపేట పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహించే సోమగూడెం(కె) గ్రామ పోలీస్ అధికారి డి రాజేందర్ గారు పేద కుటుంబానికి సహాయం చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. సోమగూడెం(కె) లోని ట్యాంక్ బస్తి లో నివాసం ఉండే రామటెంకి చంద్రు అను మహిళ పేద కుటుంబం కాగా ఈ విషయాన్ని గ్రామ సర్పంచ్ సపాట్ శంకర్ కానిస్టేబుల్ రాజేందర్ దృష్టికి తీసుకురావడంతో వెంటనే స్పందించి కానిస్టేబుల్ రాజేందర్ తన కొడుకు అద్వైత్ పుట్టినరోజు సందర్భంగా కుటుంబానికి 50 కిలోల బియ్యం, నిత్యవసర సరుకులు అందించారు. ఆమె భర్త గత సంవత్సరం రోడ్డు ప్రమాదంలో మరణించడంతో కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు పడుతుండగా స్పందించి సహాయం చేసినట్లు కానిస్టేబుల్ డి రాజేందర్ తెలిపారు. పేద కుటుంబానికి సహాయం చేసిన పోలీస్ రాజేందర్ ను పలువురు అభినందించారు. కార్యక్రమంలో సోమగూడెం(కె) సర్పంచ్ సపాట్ శంకర్ పాల్గొన్నారు.