Kasipet News/Somagudem:-
కాసిపేట మండలంలోని పెద్దనపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని నాయకపుగూడెం (గిరిజన గూడెం) లో నిన్న శుక్రవారం ఉచిత రేషన్ బియ్యం పంపిణీ చేయడాన్ని తప్పు పడుతూ సోమగూడెం రేషన్ డీలర్ కీ మెమో ఇవ్వడం అన్యాయమని గ్రామ సర్పంచ్ వేముల కృష్ణ గారు అన్నారు. లాక్ డౌన్ నేపథ్యంలో ప్రజలు రేషన్ షాప్ కి వచ్చి, బియ్యం తీసుకెళ్లడం వారికీ ఇబ్బంది కాబట్టి ఈ విషయాన్ని కాసిపేట ఎస్ఐ రాములు గారి దృష్టికి తీసుకెళ్లడంతో ఎస్ఐ గారు కాసిపేట తహశీల్దారు గారి అనుమతితో ట్రాక్టర్ లో బియ్యం తీసుకొని వెళ్లి ప్రజలకు పంపిణి చేయడం జరిగిందని అన్నారు. ఇందుకు గ్రామ పంచాయతీ ప్రజలు సంతోషం వ్యక్తం చేయగా అధికారులకు మాత్రం తప్పుగా కనిపించడం దారుణమని అయన అన్నారు. ఇదే పద్ధతిలో మిగితా రవాణా సౌకర్యం లేని నిరుపేద గిరిజన ప్రజలందరికి ఇంటి ఇంటికి రేషన్ బియ్యం, మరియు ప్రభుత్వం ప్రకటించిన 1500 రూపాయలు పంపిణీ చేయాలని ప్రభుత్వానికి, అధికారులకు అయన విజ్ఞప్తి చేసారు. వెంటనే రేషన్ డీలర్ కీ ఇచ్చిన మెమో ను వెనుకకు తీసుకోవాలని అయన డిమాండ్ చేసారు.