
Kasipet Mandal News:-
కాసిపేట మండలం ముత్యంపల్లి గ్రామంలోని పెట్రోల్ బంక్ వద్ద గురు రాజ్ కృప ఆటో మొబైల్స్ వారు సినో బ్యాంక్ ద్వారా ఆధార్ కార్డు తో ఎక్స్ట్రా చార్జీలు తీసుకోకుండా డబ్బులు ఇస్తున్నారు. ప్రజలు బ్యాంకుల వద్ద గుమ్మికూడడం వల్ల కరోనా వైరస్ ఒకరినుండి మరొకరికి ప్రబలే అవకాశం ఉన్నందున, గంటలతరబడి బ్యాంకుల వద్ద వేచి చూడకుండా రమేష్ గారు ప్రజలకు ఆధార్ కార్డు తో బ్యాంక్ ఖాతాలో ఉన్న డబ్బులను ఇస్తున్నారు. ఈరోజు దుబ్బగూడెం గ్రామస్థులు 30 మందికి ఆధార్ తో డబ్బులు ఇచ్చారు. ఈరోజు కార్యక్రమంలో సర్పంచ్ ఆడే బాదు గారు, ఉపసర్పంచ్ బోయిని తిరుపతి యదావ్ గారు పాల్గొన్నారు.