Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

తలసేమియా బాధిత పిల్లల కోసం 75 యూనిట్లు రక్తం

  • ఈరోజు నిర్వహించిన రక్త దాన శిబిరంలో 
  • పాల్గొన్న ప్రముఖులు 

Kasipet News/Devapur:-
కాసిపేట మండలం దేవాపూర్ గ్రామంలోని ఆరోగ్య ఉప కేంద్రం లో యువ శక్తి యూత్ ఆధ్వర్యంలో లాక్ డౌన్ మేరకు సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ తలసేమియా బాధిత పిల్లల కోసం 75 యూనిట్లు రక్త దానం చేశారు. రక్తం బ్యాగులు సరిపోకపోవడం వల్ల చాలా మంది యువత రక్తం ఇవ్వలేక వెనుతిరిగి పోయారు. మరికొన్ని రోజుల్లో మరొక రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరుగుతుందని యువశక్తి యూత్ వారు తెలిపారు.  ఈ కార్యక్రమంలో  యువ శక్తి యూత్ సభ్యులు దండవేణి చందు, జక్కుల చంటి, అన్నం కుమార్,  కనుకుంట్ల శేఖర్, అన్నం కుమార్, నరేష్, శాస్త్రి, సంజీవ్, సాగర్, వినోద్, దేవాపూర్ సర్పంచ్ మడావి తిరుమల అనంతరావు, మద్దిమడ సర్పంచ్ జంగు, ఉప సర్పంచ్ కటకం రవీందర్, టిఆర్ఎస్ పార్టీ మండల ప్రసిడెంట్ బొల్లు రమణారెడ్డి, నాయకులు తిరుపతి రెడ్డి, పురుషోత్తం, జనార్ధన్, రాందాస్, బింగి శ్రీనివాస్, లయన్స్ క్లబ్ గొంది వెంకటరమణ, దుర్గం మహేందర్, పాల్గొన్నారు.
Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App