Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

టాస్క్ ఫోర్స్ పోలీసుల ఆకస్మిక తనిఖీలు...

  • అక్రమంగా నిల్వచేసిన సరుకులు స్వాధీనం 
Kasipet Mandal News:-
రామగుండం కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీ వి.సత్యనారాయణ ఐపిఎస్ (డీఐజి) గారి ఆదేశాల మేరకు ఈ రోజు టాస్క్ ఫోర్స్ సీఐ కిరణ్ గారు కాసిపేట మండలం దేవాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మెయిన్ రోడ్ ఏరియా లో, ఎలిగేటి రవీందర్ అనే వ్యక్తి ప్రభుత్వం తరఫున పేద ప్రజలకు అందించే సబ్సిడీ గ్యాస్ సిలిండర్లను అక్రమంగా నిల్వ చేస్తూ, రహస్యంగా వాటిని చిన్న చిన్న సిలిండర్లలోకి ఎక్కిస్తూ ఎక్కువ రేటుకు అమ్ముతున్నాడనే పక్కా  సమాచారం తో అతని ఇంటి పరిసరాలలో తనిఖీ చేసారు. మొత్తం 28 నిండు గ్యాస్ సిలిండర్లు, 12 చిన్న గ్యాస్ సిలిండర్లు, గ్యాస్ రీఫిల్లింగ్ చేసే గ్యాస్ పైపు మరియు గ్యాస్ బరువును తూకం వేస్తున్న తరాజు, వాటితో పాటు సుమారు 50,000 రూపాయల విలువ గల ప్రభుత్వ ప్లాస్టిక్ కవర్లు, గ్లాసులు స్వాధీన పరుచుకొని తదుపరి విచారణ నిమిత్తం దేవాపూర్ పోలీసు వారికి అప్పగించారు.


టాస్క్ ఫోర్స్ సీఐ కిరణ్ గారు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వంట గ్యాస్ ను కర్ఫ్యూ సందర్భంగా మూడు నెలలు ( ప్రధానమంత్రి ఉజ్వల పథకం కింద లబ్ధి పొందిన వారికి) ఉచితంగా, ఎలాంటి కొరత లేకుండా అందించడం జరుగుతుందన్నారు. కొంతమంది అక్రమ వ్యాపారులు, వారి యొక్క స్వలాభం కోసం అక్రమ వ్యాపారం  చేసే ఉద్దేశంతో, వంట గ్యాస్ ను వారి యొక్క రహస్య గోదాములలో బ్లాక్ చేస్తూ, వాటిని రహస్యంగా చిన్న చిన్న సిలిండర్లలో కి ఎలాంటి అనుమతులు లేకుండా ఎక్కిస్తూ, ఎక్కువ ధరకి అమ్ముకోవడం ద్వారా అధిక లాభాలు గడిస్తున్నారన్నారు. 14 కిలోల బరువుగల గ్యాస్ కి ప్రభుత్వం రాయితీ పోను 600 రూపాయలకు అందిస్తుంది. కొన్ని పథకాల కింద కొంత మంది నిరుపేదలకు పూర్తి సబ్సిడీ ద్వారా ఉచితంగా అందిస్తుంది. కానీ కొంత మంది అక్రమార్కులు 14 కిలోల గ్యాస్ సిలిండర్ ను కొంతమంది పేద ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకుని వారి వద్ద నుండి 600 నుండి 700 రూపాయల వరకు కొనుక్కుని అందులో ఉన్న గ్యాస్ ను చిన్నచిన్న సిలిండర్లలో కెక్కించి కిలోకు వంద రూపాయల చొప్పున అమ్ముతూ రెండింతల లాభాన్ని పొందుతున్నారు. అంతేకాకుండా ఇలా చేసే క్రమంలో సరైన జాగ్రత్తలు పాటించకుండా, అవగాహన లేమితో రీఫిల్లింగ్ చేయడం వలన, రీఫిల్లింగ్ గోదాములు జనావాసాల మధ్య లో ఉండడం వలన ఏదైనా ప్రమాదం సంభవిస్తే ఊహించని రీతిలో ధన ప్రాణ, నష్టం జరుగుతుందని, కావున ఇలాంటి  అక్రమ దందా వ్యాపారులను విడిచిపెట్టేది లేదని, పక్కా సమాచారంతో దాడి చేసి పట్టుకొని చట్టప్రకారం శిక్షిస్తామని అన్నారు. ఈ టాస్క్ లో రామగుండం టాస్క్ ఫోర్స్ సిఐ కిరణ్ గారు మరియు వారి సిబ్బంది, సంపత్ కుమార్, వెంకటేశ్వర్లు, సదానందం గౌడ్, శ్రీనివాస్, శ్యాంసుందర్, ఓంకార్, భాస్కర్ గౌడ్, రాకేష్ లు పాల్గొన్నారు.

Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App