లాక్ డౌన్ వల్ల సామాన్య పేద ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాసిపేట మండల ప్రజాప్రతినిధులు, నాయకులు, యూవత ముందుకువచ్చి వారికీ తోచినవిధంగా ప్రజలకు సహాయం చేస్తున్నారు. దేవాపూర్ OCC యూనియన్ అధ్యక్షులు రాంమోహన్ రావు గారి సహకారంతో గ్రామపంచాయతీ పరిశుద్ధ కార్మికులకు మరియు పేదలకు కాసిపేట మండల తెరాస పార్టీ ప్రసిడెంట్ రమణారెడ్డి గారి ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులను అందజేశారు. ఈ కార్యక్రమంలో తిరుపతి రెడ్డి గారు, సర్పంచ్ తిరుమల అనంతరావు గారు, ఉపసర్పంచ్ రవీందర్, వర్డ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
వికలాంగులకు:-
ఓరియంట్ కంపెనీ యూనియన్ అధ్యక్షులు రామ్మోహన్ రావు గారు మరియు తెరాస పార్టీ మండల అధ్యక్షులు రమణ రెడ్డి గారి సహకారంతో వికలాంగులకు పార్టీ కార్యకర్త సంజీవ్ యాదవ్ గారు వంటసామాగ్రిని అందజేశారు. మొత్తం 20 మంది వికలాంగులకు బియ్యం, కూరగాయలు అందజేయునట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో నరేష్ యాదవ్, అఖిల్ యాదవ్, రమేష్, విజయ్, మహేష్, అరవింద్, రవితేజ, రాజేష్ పాల్గొన్నారు.