Kasipet Mandal News:-
కాసిపేట మండలంలో ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత డా,, B.r అంబెడ్కర్ గారి 129 వ జయంతి వేడుకలు జరిగాయి. ఆయా కార్యాలయాలలో సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు అంబెడ్కర్ చిత్రపటానికి పూలమాల వేసి జయంతిని నిర్వహించారు. సామాజిక ఛైతన్య వేదిక అధ్యక్షులు పల్లె మల్లయ్య గారి ఆధ్వర్యంలో కాసిపేట మండల కేంద్రంలోని అంబెడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి, అనంతరం ప్రజలకు మాస్కులను పంపిణి చేసారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో జాగృతి మండల అధ్యక్షులు సురేష్ గారి ఆధ్వర్యంలో వారి ఇంటివద్దే జయంతిని నిర్వహించారు. కరోనా వైరస్ లాక్ డౌన్ నేపథ్యంలో చాలావరకు కార్యాలయాలలో, ఇండ్లలోనే జయంతిని జరుపుకున్నారు.