![]() |
నిరసన వ్యక్తం చేస్తున్న దృశ్యం |
కేంద్ర ప్రభుత్వం కరోనా వైరేస్ ను నివారించుటకు విధించిన లాక్ డౌన్ మూలంగా ఇబ్బందులు పడుతున్న ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించకుండా ప్రధాని మోడీ గారు తీపి మాటలతో కడుపులు నింపేపని చేస్తున్నారని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు సంకే రవి గారు ఆరోపించారు. ఒక పక్క లాక్ డౌన్ విధించి మరో పక్క కార్పొరేట్ కంపెనీ యజమానులకు అనుగుణంగా 12 గం.ల పని విధానాన్ని తీసుకురావాలని చూస్తున్నారని ఆయన వాపోయారు. ప్రతి పేదకుటుంబాలకు రూ.7,500/నగదు, నిరుద్యోగులందరికి నిరుద్యోగ భృతి రూ.5000/ ఇవ్వాలని డిమాండ్ చేసారు. వలస కూలీలను ఆదుకోవాలని, కరోనా వైరస్ ని అరికట్టుటకు పనిచేస్తున్న సిబ్బందికి రక్షణ పరికరాలు ఇవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో భగత్ సింగ్ యువజన సంఘం నాయకులు రాకేష్, శ్రీనివాస్, రాజ, వినోద్, రవి, అశోక్, చిన్న, సునీల్, వివిధ రంగాల్లో పనిచేస్తున్న కార్మికులు రాజేందర్, భూషనం, మొగోలి, భిక్షపతి, రమ, రాజేష్, విజయ్ పాల్గొన్నారు.