Covid-19 Effect:-
కరోనా వైరస్ ప్రపంచాన్ని అతలాకుతలం చేసున్న నేపథ్యంలో వైరస్ ని కట్టడి చేయడానికి భారత ప్రభుత్వం లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. లాక్ డౌన్ వల్ల ప్రజలు అత్యవసర పరిస్థితులలో తప్ప బయటికి వచ్చే అవకాశం లేదు. దీనిని దృష్టిలో ఉంచుకొని ఎమ్ - సెట్, ఈ - సెట్, పాలీసెట్ దరఖాస్తు చివరి తేదీ పొడిగించారు. ఎమ్ - సెట్ మరియు ఈ - సెట్ దరఖాస్తు చివరి తేదీ ఏప్రిల్ 20 వరకు పొడగించగా, పాలీసెట్ చివరి తేదీ ఏప్రిల్ 17 వరకు పొడిగించారు. పాన్ కార్డు తో ఆధార్ కార్డు అనుసంధానం చివరితేది జూన్ 30 వరకు పొడగించిన విషయం తెలిసిందే! అలాగే BS4 వాహనాల రిజిస్ట్రేషన్ చివరి తేదీ పొడగిస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది.