Kasipet Mandal News:-
కాసిపేట మండలంలో పనుల కోసం వచ్చి
లాక్ డౌన్ లో చిక్కుకొని తినటానికి కూడా తిండి లేక ఇబ్బంది పడుతున్న తమిళనాడు, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన కూలీలకు కాసిపేట పోలీసులు సహాయం చేసి పోలీసుల గొప్ప మానవత్వాన్ని చాటుకున్నారు. కాసిపేట మండలంలోని గుండ్ల పహాడ్ గ్రామ శివారులో నూతనంగా ఏర్పాటు చేస్తున్న సోలార్ ప్లాంట్ కు సంబందించిన సామాగ్రి అన్లోడింగ్ కోసం ఆంధ్ర, తమిళనాడు, మధ్యప్రదేశ్ కు చెందిన దాదాపు 30 మంది కూలీలు వచ్చారు. లాక్ డౌన్ లో ఇక్కడే చిక్కుకుపోగా, వారికి తిరిగి వెళ్లాడానికి, తినడానికి వారి వద్ద ఏమిలేక కష్టపడుతున్నారని సమాచారం రావడంతో కాసిపేట ఎస్ఐ రాములు గారు వెంటనే స్పందించారు. వారి వద్దకు చేరుకొని వివరాలు అడిగి తెలుసుకున్నారు. కూలీలు తమ ఆవేదనను ఎస్ఐ రాములుకు వివరించారు. దింతో వారికి భోజన సదుపాయాలు, అందుకు కావాల్సిన వంట సామాగ్రిని అందించారు. ఈ సందర్బంగా తమకు సహాయం చేసిన ఎస్ఐ రాములు, పోలీస్ సిబ్బందికి కూలీలు కృతజ్ఞతలు తెలిపారు.