Kasipet Mandal App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

వివాహానికి సహాయం అందజేత

Kasipet News/Devapur:-
కాసిపేట మండలంలోని దేవాపూర్ గ్రామంలో
నిరుపేద కుటుంబానికి చెందిన చెన్నూరి శంకర్ తీవ్ర ఆర్థిక పరిస్థితుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు.   అతని భార్య అమృత గత ఆరు నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. శంకర్ వృత్తిరీత్యా ట్రాక్టర్ డ్రైవర్ గా పని చేస్తున్నారు. చెన్నూరి శంకర్ - అమృత దంపతులకు కూతురు రాజ్యలక్ష్మి వివాహం రేపు జరగనుంది. అతని ఆర్థిక పరిస్థితి తెలుసుకున్న లయన్స్ క్లబ్ ఆఫ్ సోమగూడెం అధ్యక్షులు గొంది వెంకటరమణ గారు 50 కిలోల బియ్యం బస్తాను అందజేయగా, మద్దిమాడ సర్పంచ్ ఆడ జంగు గారు 25 కిలోల బియ్యం బస్తాను, దేవాపూర్ సర్పంచ్ తిరుమల అనంత రావు గారు 2,500 రూపాయల విలువ గల వంట సామాగ్రిని అందజేశారు. ఈ కార్యక్రమంలో మద్దిమాడ సర్పంచ్ ఆడే జంగు గారు, దేవాపూర్ సర్పంచ్ మడావి తిరుమల అనంత రావు గారు, వార్డ్ మెంబర్ కైలాస్, ట్రాక్టర్ ఓనర్ పోశం పాల్గొన్నారు.




Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App