Kasipet Mandal News:-
కాసిపేట మండలంలో ఈరోజు పరిస్థితి
నిన్నటితో పోలిస్తే కొంతవరకు మెరుగయింది. అక్కడక్కడా ప్రజలు బయటికి వచ్చినప్పటికీ అధికారుల, ప్రజాప్రతినిధుల హెచ్చరికలతో ఇండ్లలోకి వెళ్లారు. కాసిపేట, కోమటిచెను గ్రామాలలో గ్రామపంచాయతీ వారు, పొలిసు సిబ్బంది మైకుల ద్వారా ఇండ్ల నుండి బయటికి రావద్దంటూ హెచ్చరించారు. కొండాపూర్ (యాప), కోమటిచెను, మల్కపల్లి, చిన్నదర్మారం, పల్లంగుండా, కోనూర్ తదితర గ్రామాలలో ఇతర ప్రాంతాల ప్రజలు, గ్రామంలోకి రాకుండా, గ్రామంలోని ప్రజలు గ్రామం నుండి బయటికి వెళ్లకుండా గ్రామా ప్రాంగణాల వద్ద అడ్డంగా కంచె అమర్చారు. పోలీస్ సిబ్బంది గ్రామాలలో గట్టి బందోబస్తు నిర్వహిస్తున్నారు. ముత్యంపల్లి గ్రామంలో గ్రామపంచాయతీ సిబ్బంది శ్యానిటైజషన్ చేసారు. మన ఆరోగ్యంకోసం ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, గ్రామపంచాయతీ సిబ్బంది, ఆశ వర్కర్లు, ఆరోగ్య సిబ్బంది, పోలీసులు ఇతర అధికారులు నిరంతరం పని చేస్తున్నారు. వారి సేవలకు బహుమానంగా మనం కొన్ని రోజులు ఇంట్లోనే ఉంటూ సహకరిద్దాం.