Kasipet Mandal News:-
కాసిపేట మండలం పల్లంగుండా గ్రామపంచాయతీ
పరిధిలోని గోండుగూడ గ్రామానికి చెందిన చిక్రం కిషన్ అనే యువకుడు జింబాంబ్వే నుండి శనివారం రాత్రి స్వగ్రామానికి వచ్చాడు. విదేశం నుండి రావడంతో గ్రామవాసులు భయాందోళనకు గురవుతున్నారు. ఈరోజు కాసిపేట పీహెచ్ వైద్యాధికారిణి కిరణ్మయి గారు చిక్రం కిషన్ ఇంటికి వెళ్లి అతనికి కరోనా వైరస్ లక్షణాలు ఉన్నాయా లేదా అని పరిశీలించి, లక్షణాలు లేవని నిర్ధారించారు. చిక్రం కిషన్ తనకు ముంబై ఎయిర్పోర్ట్ లో కరోనావ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసి, కరోనా నెగిటివ్ గా తెల్సినట్లు తెలిపాడు. వైద్యాధికారి కిరణ్మయి గారు మాట్లాడుతూ అతనికి కరోనా వైరస్ లక్షణాలు లేవని, ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని అన్నారు. అతను విదేశం నుండి వచ్చినందున 14 రోజులు ఐసొలేషన్ లో ఉండాలని సూచించినట్లు తెలిపారు.