Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

ప్రజలకు హెచ్చరిక

Covid-19:-
కరోనా వైరస్ విజృంభన నేపథ్యంలో వైరస్ గురించి
సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చక్కర్లు కొడుతున్నాయి. రేపు ఏప్రిల్ 1st కావడంతో సరదాగా స్నేహితులను ఆట పట్టించడానికో, లేదా ప్రజలను ఫూల్స్ చేయాలనే ఉద్దేశంతో ఆకతాయిలు సోషల్ మీడియా వేదికగా అసత్య వార్తలు, అసత్య ప్రచారాలు చేసే ప్రమాదం ఉంది. ప్రజలు ఆ అసత్య వార్తలు నమ్మి భయాందోళనలకు గురయ్యే అవకాశము ఉంది. కాబట్టి మీకు వచ్చే వార్తలు వాస్తవమని తెలిసినపుడే ఇతరులకు పంపండి. సైబర్ క్రైం పోలీసులు సోషల్ మీడియాలో అసత్య వార్తలు పంపే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. సరదాగా మీ స్నేహితులను ఆట పట్టించడానికి తప్పుడు వార్తలు పంపితే, అది వైరల్ గా  మారితే తరువాత మీరే ఫూల్స్ అవుతారు జాగ్రత్త.




Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App