Kasipet Mandal App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

జాగృతి గ్రామ అధ్యక్షుల ఎన్నిక

Kasipet Mandal News:-
కాసిపేట మండల కేంద్రములో తెలంగాణ
జాగృతి సమావేశం ఏర్పాటుచేసి మండలంలోని వివిధ గ్రామపంచాయతీ కార్యవర్గమూలను జిల్లా అధ్యక్షులు లింగంపల్లి ప్రేమ్ రావు గారు నియమించి నియామక పత్రాలను అందజేశారు. అయన  మాట్లాడుతూ మండలంలో జాగృతిని బలోపేతం చేయడానికి కార్యవర్గమూలను ఎన్నుకున్నట్లు తెలిపారు. నూతనంగా నియామకమయినవారు జాగృతి ఆశయాల కొరకు కృషిచేయాలని, సమాజానికి  సేవలను అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కో -కన్వీనర్ మద్ది లక్ష్మణ్,  కాసిపేట మండల అధ్యక్షులు సోదారి సురేష్, మంచిర్యాల అధ్యక్షులు మాడే మంతయ్య గారు పాల్గొన్నారు. ముత్యంపల్లి గ్రామ పంచాయతీ అధ్యక్షులుగా గంగాదరి రాజకుమార్, చిన్నధర్మారం సురం వినోద్, కాసిపేట రత్నం అరుణ్ కుమార్, గట్రావుపల్లి ఆత్రం జంగు, మల్కపల్లి ఆత్రం ప్రవీణ్, సోనాపూర్ సిడం శ్యామ్ రావు, వెంకటాపూర్ మడ పచ్చి తిరుపతి, రొట్టెపల్లి చక్రం రాందాస్, కొండాపూర్ కంది ధర్మయ్య, కాసిపేట (కే )మంతెన రమేష్, పల్లంగూడ అధికార ప్రతినిధి నవనందుల శ్రీహరి గారిని నియమించారు.




Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App