Kasipet Mandal App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

కారోన వైరస్ పై అవగాహనా కార్యక్రమం

Kasipet Mandal News:-
కారోన వైరస్  సోకకుండా తీసుకోవలిసిన
జాగ్రత్తలపై తెలంగాణ మోడల్ స్కూల్ కాసిపేట ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు కాసిపేట మండలం ముత్యంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని  ఇంటింటికి వెళ్లి అవగాహనా కల్పించారు. ప్రతి ఒక్కరు జాగ్రత్త గా వ్యవహరించాలని  దగ్గు, జలుబు మరియు జ్వరం ఉంటే వెంటనే  హాస్పిటల్  వెళ్లాలని, చేతులు సబ్బుతో కడుక్కోవాలని సూచించారు. తప్పని సరి అయితేనే ప్రయాణం చేయాలని మాస్క్  ధరించాలని అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరు సాధ్యమైనంత వరకు  సమూహంగా ఉండకుండా ఉండాలి అని,  ప్రతి ఒక్కరికి పరిశుభ్రత పై అవగాహన కలిగి ఉండాలని అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ అందె నాగమల్లయ్య గారు ఉపాద్యాయుని, ఉపాధ్యాయులు మరియు నాన్ టీచింగ్ స్టాఫ్ మరియు ఫ్రెండ్లీ పోలీస్ సిబ్బంది కూడా పాల్గొన్నారు.



Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App