Kasipet Mandal News:-
కాసిపేట మండలంలో ఈరోజు నిర్వహించిన
జనతా కర్ఫ్యూ విజయవంతం అయింది. ప్రజలు స్వచ్చందంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. దేవాపూర్ సిమెంట్ కంపెనీ పనులు యధావిధిగా కొనసాగినట్లు సమాచారం. ఓరియంట్ కంపెనీకి వెళ్లే లారిలు నడిచాయి. ఆదివారం కావడంతో అక్కడక్కడ చికెన్ సెంటర్ నిర్వహులు మాత్రం వ్యాపారాన్ని నిర్వహించారు. పెద్దనపల్లి గ్రామంలోని కొత్త కాలనీలో బ్లీచింగ్ పౌడర్ చల్లి శ్యానిటైజ్ చేశారు. పోలీస్ సిబ్బంది గ్రామాలలో నిరంతరం పెట్రోలింగ్ నిర్వహించారు. ప్రజారవాణా ఎక్కడికక్కడ స్థంభించింది. గ్రామాల్లోని ప్రజలు, నాయకులు, ప్రజాప్రతినిధులు సాయంత్రం 5గంటలకు ఇంటిబయటికి చేరి చప్పట్లతో వైద్య సిబ్బందిని, శ్యానిటైజ్ సిబ్బంది, పోలీస్ సిబ్బంది సేవలను కీర్తించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ గారి పిలుపు మేరకు స్వీయ నిర్బంధ కార్యక్రమం మర్చి 31వ తేది వరకు కొనసాగనుంది.