App Update చేయండి... Ads లేకుండా వార్తలను చదవండి...

Ignore If Alredy Update

నిరుద్యోగులకు ఉచిత శిక్షణ మరియు ఉపాధి

Mancherial District News:-
మంచిర్యాల జిల్లాలోని నిరుద్యోగ యువతకు
దీన దయాల్ ఉపాధ్య గ్రామీణ కౌశల్య యోజన వారు DRDA-EGMM ద్వారా 90 రోజుల ఉచిత శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నారు. 19 - 26 లోపు వయస్సు గల యువకులు పదవ తరగతి,  ఇంటర్, డిగ్రీ,  ఐటిఐ ఏదైనా పాస్/ఫెయిల్ అయిన వారు అర్హులు. మొత్తం 90 రోజుల శిక్షణలో భాగంగా 75 రోజులు మంచిర్యాల జిల్లా కేంద్రంలో, 15 రోజులు  హైదరాబాద్ లో  శిక్షణ అందిస్తారు. శిక్షణ తర్వాత హైదరాబాద్ లోని డీమార్ట్, స్పెన్సర్స్, రిలయన్స్, సామ్ సంగ్, హెరిటేజ్, మెక్ డోనాల్డ్ తదితర సంస్థల్లో ఉపాధి కల్పిస్తారు. 
వేతనం 10,500 నుండి 12,500 రూపాయల వరకు ఉంటుంది. ఈరోజు (మార్చ్ 12, 2020) ఉదయం 10 గంటలనుండి సాయంత్రం 5 గంటలలోపు జిల్లా కేంద్రంలోని సాయి కుంట లో గల ఇంటిగ్రేటెడ్ బీసీ బాయ్స్ హాస్టల్ లో పాస్ పోర్ట్ సైజ్ ఫొటోస్ (6), రేషన్ కార్డు, పదోతరగతి మెమో, ఆధార్ కార్డు, రెసిడెన్షియల్, క్యాస్ట్ సర్టిఫికెట్, బ్యాంక్ పాస్ బుక్ జిరాక్స్, హైయర్ ఎడ్యుకేషన్ సర్టిఫికెట్స్ తీసుకువెళ్లి తమ వివరాలను నమోదు చేసుకోవచ్చు. శిక్షణ సమయంలో ఉచిత భోజనం, వసతి సదుపాయం కల్పించనున్నారు.




Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App