Kasipet News/Somagudem:-
కాసిపేట మండలంలోని సోమగూడెం
రహదారిపై ప్రయాణిస్తున్న లారీలో కళేబరాలను తరలిస్తున్నారనే ఆరోపణలతో కొందరు యువకులు లారీని వెంబడించి అడ్డుకున్నారు. లారీలో ఉన్న వ్యక్తులతో ఘర్షణలకు దిగారు. కాసిపేట ఎస్ఐ రాములు గారు లారితోపాటు యువకులను స్టేషన్ కు తరలించారు. పశువుల యాజమాని అయిన కొండారెడ్డి అనే రైతు కొనుగోలు పత్రం చూపించి, వ్యవసాయ పనుల నిమిత్తం పశువులను తరలిస్తున్నట్లు తెలిపారు. యువకులు తనపై దాడి చేసి, డబ్బులు డిమాండ్ చేసారని రైతు తెలుపడంతో ఆ 13 మంది యువకులపై కేసు నమోదు ఆయింది. ఈ వార్తను మన తెలంగాణ దినపత్రిక ఈరోజు ప్రచురించింది.