Kasipet News/Devapur:-
కాసిపేట మండలంలోని దేవాపూర్ గ్రామంలో
నాలుగు రోజులుగా ఆదివాసీలు ఓరియంట్ సిమెంట్ కంపెనీ ముందు చేస్తున్న ఆందోళనలు గురువారం సద్దుమణిగాయి. మందమర్రి సిఐ ఎడ్ల మహేష్ ఆదివాసీలకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇవ్వడంతో ఆదివాసీలు ఆందోళనను విరమించారు. ఓరియంట్ సిమెంట్ కంపెనీ వల్ల జరిగే నష్టాలను ప్రభుత్వానికి నివేదిక రూపంలో పంపించామని, కంపెనీ యాజమాన్యంతో మాట్లాడి రెండు రోజుల్లో తాత్కాలికంగా ఉద్యోగాలను కల్పిస్తామని సీఐ మహేష్ హామీ ఇచ్చారు. తుడుం గూడెం, రేగుల గూడెం గ్రామాల ఆదివాసులు తమకు ఓరియంట్ సిమెంట్ కంపెనీలో ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చి, ఉద్యోగాలు ఇవ్వలేదని, కంపెనీ నుంచి వచ్చే కాలుష్యంతో రోగాల బారిన పడుతున్నామని, తమకు న్యాయం చేయాలని నాలుగు రోజులుగా ఆందోళనలు చేశారు.