Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

ఆరోగ్య కేంద్రం ముందు ఆందోళన చేసిన ప్రజాప్రతినిధులు, స్థానికులు

Kasipet Mandal News:-
కాసిపేట మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య
కేంద్రంలో ఇటీవల Expire Date ముగిసిన మందులను చికిత్స కోసం ఉపయోగించిన విషయం తెలిసిందే. ఈ విషయమై సోమవారం మండల ప్రజా ప్రతినిధులు, స్థానికులు ఆరోగ్య కేంద్రం ముందు ఆందోళన చేశారు. జడ్పీటీసీ పల్లె చంద్రయ్య, ఉపసర్పంచ్ బోయిని తిరుపతి  మాట్లాడుతూ వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్య సిబ్బంది స్థానికంగా ఉండాలనే ఉదేశ్యంతో వారు ఉండడానికి ప్రత్యకంగా గదులు నిర్మించినప్పటికి ఉపయోగించడం లేదని వాపోయారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బంది పై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని మెడికల్ ఆఫీసర్ కిరణ్మయి గారు హామీ ఇవ్వడంతో ఆందోళనలు విరమించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పల్లె చంద్రయ్య, వైస్ ఎంపీపీ విక్రమ్,   ముత్యంపల్లి ఉపసర్పంచ్ తిరుపతి, ఎంపీటీసీ కొండబత్తుల రాంచందర్, మండల కో ఆప్షన్ సిరాజ్ ఖాన్, కాసిపేట ఉపసర్పంచ్ సుమన్, శంషీర్ తదితరులు పాల్పొన్నారు.


Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App