Kasipet Mandal News:-
కాసిపేట మండలంలోని ధర్మారావుపేట ప్రాథమిక
వ్యవసాయ సహకార సంఘం ఎన్నికల పక్రియలో ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. సోమవారం నామినేషన్ల ఉపసంహరణ లో భాగంగా ఏకంగా పది మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. మొత్తం 46 నామినేషన్లు నమోదు కాగా, ఎనిమిది మంది అభ్యర్థులు అనర్హులు కావడంతో సంఖ్య 38 కి తగ్గింది. ఈరోజు పది మంది అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకోవడంతో తుది జాబితాలో మొత్తం 13 వార్డులలో 28 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 4వ వార్డులో దుర్గం లక్ష్మి, 12వ వార్డులో జంజిరాల విష్ణుమూర్తి ఏకగ్రీవంగా ఎన్నికవడం విశేషం.