Kasipet Mandal News:-
కాసిపేట మండలంలోని మద్దిమడలో ఈరోజు
టీయూటీఎఫ్ డైరీ ని గౌరవ మండల అధ్యక్షురాలు రోడ్డ లక్ష్మి -రమేష్ గారు ఆవిష్కరించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ప్రభుత్వ స్కూల్స్ కు పేద పిల్లలు వస్తారని వారికీ నాణ్యమయిన విద్యనందిచాలని కోరారు. విద్యకు అధికప్రాధాన్యం ఇస్తూ మధ్యాన్న భోజనంకు సన్నబియ్యం, ఉచిత పుస్తకాలు, ఏకరూపాదుస్తులు, మౌలిక వసతులు కల్పిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీయూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి మద్ది లక్ష్మణ్, జిల్లా గౌరవ సలహాదారు లింగంపల్లి ప్రేమ్ రావు, కార్యదర్శి సిడం శంకర్ ప్రకాష్, మండల గౌరవ అధ్యక్షులు మంగ నారాయణ, ప్రధానకార్యదర్శి బండారి లస్మయ్య, జిల్లా కౌన్సిలర్లు మల్లేష్, వేణుమాధవ్, మండల కార్యదర్శి బద్ది సుగుణ, కాంప్లెక్స్ హెచ్ఎం దామోదర్ రెడ్డి పాల్గొన్నారు.
రాష్ట్ర కార్యవర్గంలో చోటు:-
టీయూటీఎఫ్ రాష్ట్ర కార్యవర్గంలో కాసిపేట మండంలోని రేగులగూడ ఆశ్రమ పాఠశాలలో పనిచేయుచున్న ఉపాధ్యాయులు నవనందుల శ్రీహరి గారిని రాష్ట్ర అకడమిక్ కమిటీ సభ్యులుగా నియమించడం జరిగింది. జిల్లాలో టీయూటీఎఫ్ ను బలోపేతం చేయడానికి జిల్లా శాఖ ప్రతినిధ్యం మేరకు కాసిపేట మండలం నుండి చోటుకల్పించడం జరిగిందని జిల్లా గౌరవ సలహాదారు లింగంపల్లి ప్రేమ్ రావు, జిల్లా అధ్యక్షులు పత్తి సత్తయ్య, ప్రధానకార్యదర్శి బన్న రవీందర్ తెలిపారు.
దేవాపూర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు సుగుణ గారు దేవాపూర్ పట్టణ కన్వీనర్ గా ఎంపీపీ రోడ్డ లక్ష్మి గారి చేతులమీదుగా నియామక పత్రం అందుకున్నారు.