Kasipet Mandal News:-
తెలంగాణ ప్రభుత్వం పల్లె ప్రగతి కార్యక్రమం పై
ప్రత్యేక దృష్టి సారించింది. రెండుసార్లు నిర్వహించిన పల్లె ప్రగతి కార్యక్రమంలో గ్రామాలు అభివృద్ధి బాటలో నడుస్తున్నాయి. మండలంలో వెనుకబడిన గ్రామాలు ఇతర గ్రామాలతో పోటీ పడుతూ అభివృద్ధి చెందడానికి ప్రభుత్వం మరో కొత్త కార్యక్రమాన్ని ముందుకు తీసుకువచ్చింది. కాసిపేట మండలంలో పల్లె ప్రగతి కార్యక్రమంలో వెనుకబడిన 4 గ్రామాలు మామిడిగూడ, ధర్మారావుపేట, తాటిగూడ, మల్కెపల్లి లలో పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎంపీడీవో, ఎంపీవో, ప్రత్యేక అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, ఇతర అధికారులు మరియు సర్పంచులు గ్రామాలలోనే ఉండి పల్లె ప్రగతి కార్యక్రమంలో పనులు జరగకపోవడానికి కారణాలను సమీక్షించనున్నారు. రాత్రిపూట గ్రామాలలోనే నిద్ర చేయనున్నారు.