Kasipet Mandal News:-
మందమర్రి కేకే 2 ఓపెన్ కాస్ట్ ప్రభావిత ప్రాంతాలలో మంగళవారం పర్యావరణ వాలంటీర్లు సర్వే
నిర్వహించారు. ఈ సందర్భంగా కాసిపేట మండలంలోని దుబ్బగూడెం, చొప్పరిపల్లి గ్రామాలలో ఇంటింటికి వెళ్లి ఓపెన్ కాస్ట్ వల్ల వారికి కలిగే ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. సర్వే పై నివేదిక తయారు చేసి హైదరాబాద్ లోని పర్యావరణ కేంద్రానికి పంపించనున్నట్లు తెలిపారు. సర్పంచ్ ధరావత్ దేవి గారు మాట్లాడుతూ ఓపెన్ కాస్ట్ వల్ల శబ్ద కాలుష్యం, నీటి కాలుష్యం జరుగుతుందని, పేలుళ్ల వలన ఇంటి గోడలు పగుళ్ళు తేలుతున్నాయి అన్నారు. సింగరేణి యాజమాన్యం చొరవ తీసుకొని ప్రభావిత ప్రాంతాలను అభివృద్ధి చేయాలని, నిర్వాసిత ప్రజలకు న్యాయం చేయాలని కోరారు. స్థానిక న్యాయవాది సత్యనారాయణ గారు మాట్లాడుతూ తాను 17 అక్టోబర్ 2017లో మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేయడంతో కమిటీ వచ్చి సర్వే చేయడం సంతోషంగా ఉందన్నారు. ఇప్పటికైనా ప్రభావిత ప్రజలకు న్యాయం జరగాలని ఆయన కోరారు.