Kasipet Mandal News:-
కాసిపేట మండలంలోని తాటిగూడెం, రేగులగూడెం
గ్రామస్థులు తమకు ఉద్యోగం కల్పించాలని దేవాపూర్ ఓరియంట్ సిమెంట్ కంపెనీ ముందు నాలుగు రోజులపాటు ఆందోళన చేసిన విషయం తెలిసిందే. మందమర్రి సీఐ మహేష్ హామీతో ఆదివాసీలు ఆందోళనలను విరమించారు. సీఐ మహేష్ ఇచ్చిన హామీ మేరకు అదనపు పాలనాధికారి సురేందర్ రావు గారితో సమావేశం ఏర్పాటు చేశారు. ఆదివాసీలు కంపెనీ వల్ల తమకు కలుగుతున్న ఇబ్బందులను వివరించారు. ఆ తరువాత అదనపు పాలనాధికారి సురేందర్ గారు మాట్లాడుతూ అన్ని శాఖల అధికారులతో కూడిన ఒక కమిటీని ఏర్పాటు చేస్తామని, కమిటీ వారం రోజులపాటు గ్రామాలలో పర్యటించి నివేదిక అందజేస్తుందని, నివేదిక ఆధారంగా న్యాయం చేస్తామని తెలిపారు.