Kasipet News/Devapur:-
కాసిపేట మండలంలోని దేవాపూర్ గ్రామ జాగృతి
మహిళా అధ్యక్షురాలుగా బద్ది సుగుణ గారిని నియమిస్తూ నియామక పత్రాన్ని జాగృతి జిల్లా అధ్యక్షులు లింగంపల్లి ప్రేమ్ రావు గారు మరియు కాసిపేట మండల అధ్యక్షురాలు శ్రీమతి రోడ్డ లక్ష్మి -రమేష్ గారు అందించారు. ఈ సందర్బంగా ప్రేమ్ రావు మాట్లాడుతూ జిల్లాలో జాగృతిని బలోపేతం చేస్తున్నామని, జాగృతి ఆశయాలు ప్రజలలోకి తీసుకువెళ్లి ప్రభుత్వనికి ప్రజలకు వారధిగా జాగృతి పని చేస్తుందని అన్నారు. యువతకు నైపుణ్యం శిక్షణ కార్యక్రమం స్కిల్స్ సెంటర్ మంచిర్యాలలో 45 రోజుల ఉచితశిక్షణ ఇస్తున్నామని, దినిని నిరుద్యోగ యువతి యువకులు సద్వినియోగము చేసుకోవాలని కోరారు. పూర్తి వివరాలకు 9440535357 కు సంప్రదించాలని అన్నారు. శిక్షణ అనంతరము సర్టిఫికెట్ ప్రదానము మరియు వివిధ కంపెనీలలో ఉద్యోగం పొందుటకు జాగృతి పక్షాన సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని వినియోగించుకోగలరని ఆయన కోరారు.