Kasipet Mandal News:-
కాసిపేట మండలంలోని కోమటిచెను, కోనూర్,
కాసిపేట, పెద్దనపెల్లి, ముత్యంపల్లి గ్రామాలలో ఎంపీడీఓ అలీం గారు పర్యటించి నర్సరీలను పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రానున్న హరితహారం నాటికీ మొక్కలను సిద్ధం చేయాలనీ సిబ్బందికి సూచించారు. అదేవిదంగా ప్రతి ఇంటికి ఇంకుడుగుంత తప్పనిసరి అని, ఇంకుడుగుంతల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలనీ అన్నారు. ఆయన వెంట APO స్వాతి, ఈజిఎస్ సిబ్బంది, ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు , సర్పంచ్, ఉపసర్పంచ్, ఫీల్డ్ అసిస్టెంట్ ఉన్నారు.