Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

సహకార సంఘం ఎన్నికల నోటీసు విడుదల

Kasipet Mandal News:-
ధర్మారావుపేట ప్రాథమిక వ్యవసాయ సహకార
సంఘం ఎన్నికల ముఖ్యమైన తేదీలు, రిజర్వేషన్ సంబంధించిన వివరాలు ఈ రోజు విడుదలైంది. ఈ నెల 6వ తేదీ నుండి 8వ తేదీ వరకు వ్యవసాయ కార్యాలయంలో నామినేషన్లు  స్వీకరించనున్నారు. అభ్యర్థులు నామినేషన్ రుసుము  చెల్లించి నామినేషన్ దాఖలు చేసుకోవచ్చును. 9వ తేదీన వచ్చిన నామినేషన్లను పరిశీలించి అర్హుల జాబితాను ప్రకటిస్తారు. 10వ తేదీన నామినేషన్ల ఉపసంహరణ దాఖలు స్వీకరించి, తుది జాబితాను ప్రకటించి, అభ్యర్థులకు గుర్తులను కేటాయిస్తారు. 15వ తేదీన కాసిపేట జూనియర్ కళాశాలలో ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు రహస్య పద్ధతిలో ఎన్నికలు జరగనున్నాయి. మధ్యాహ్నం రెండు గంటలకు ఓట్లను లెక్కించి, ఫలితాలను ప్రకటిస్తారు.



Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App