కాసిపేట మండలం దేవపూర్ గిరిజన బాలికల
ఆశ్రమ పాఠశాలలో పిల్లలకు అందించాల్సిన పాల ప్యాకెట్లు పక్క దారి పడుతున్నాయి. అడిగే నాధుడు లేకపోవడంతో ఆశ్రమ పాఠశాలలో పనిచేసే వంట మనిషి పాల ప్యాకెట్లను అక్రమంగా తరలించగా స్థానికులకు దొరికాడు. పాఠశాలలో ఉపాధ్యాయులు సరిగ్గా హాజరు కావడం లేదని ఈరోజు ఆంధ్ర ప్రభ ప్రతేక కధనం ప్రచురించింది. ఉన్నతాధికారులు పట్టించుకోని సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు, విద్యార్థుల తల్లితండ్రులు కోరుతున్నారు.