Kasipet News/Devapur:-
కాసిపేట మండలంలోని దేవాపూర్ గ్రామంలో
ఆదివాసీలు ఓరియంట్ సిమెంట్ కంపెనీలో క్వారి పనులు అడ్డుకొని ఆందోళనలు చేసిన విషయం తెలిసిందే. మందమర్రి సిఐ ఎడ్ల మహేష్ ఆదివాసీలకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇవ్వడంతో ఆదివాసీలు ఆందోళనను విరమించారు. అదనపు పాలనాధికారి సురేందర్ రావు గారు ఏర్పాటు చేసిన కమిటీ బుధవారం గ్రామాల్లో పర్యటించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
తమకు ఓరియంట్ సిమెంట్ కంపెనీలో ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చి, ఉద్యోగాలు ఇవ్వలేదని, కంపెనీ నుంచి వచ్చే కాలుష్యంతో రోగాల బారిన పడుతున్నామని ఆదివాసులు కమిటీ సభ్యులకు తెలిపారు. ఈ కమిటీ వారం రోజులపాటు గ్రామాల్లో పర్యటించి నివేదిక తయారుచేసి పాలనాధికారికి అందించనుంది.