Bellampalli/Kasipet:-
బెల్లంపల్లిలోని అమ్మ అనాధ శరణాలయానికి
కాసిపేట జెడ్పిటిసి పల్లె చంద్రయ్య గారు 2,500 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. పల్లె చంద్రయ్య గారు మాట్లాడుతూ అనాధ పిల్లలకు సహాయం చేయడం సంతోషంగా ఉందని, దేవుని హుండీలో డబ్బులు వేయడం కన్నా పేదవారికి, అనాధలకు సహాయం చేయడం ఉత్తమమని అన్నారు. అమ్మ అనాధ శరణాలయంలో 18 మంది అనాధలు ఉన్నారు.