ఈరోజు లయన్స్ క్లబ్ ఫౌండర్ మెల్విన్ జోన్స్
పుట్టినరోజు వేడుకలను లయన్స్ క్లబ్ ఆఫ్ సోమగూడెం వారు కోరుట్ల లో నిర్వహించారు. సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ సోమగూడెం అధ్యక్షులు గొంది వెంకటరమణ గారి తండ్రిగారైన కీర్తిశేషులు గొంది బుచ్చన్న గారి జ్ఞాపకార్థం (1000 అమెరికా డాలర్లు) 72 వేల రూపాయలను 320 జి గవర్నర్ డాక్టర్ ఆర్ విజయ మేడం గారు, ఫస్ట్ వైస్ గవర్నర్ గుర్రం శ్రీనివాస్ రెడ్డి గారు , సెకండ్ వైయస్ వైస్ గవర్నర్ నాగుల సంతోష్ గారు మరియు స్పెషల్ క్లబ్ కోఆర్డినేటర్ లయన్ కట్కూరు సత్యనారాయణ గారు వారి చేతుల మీదుగా ఇంటర్నేషనల్ లైన్స్ క్లబ్ వారికి అందించారు. ఈ డబ్బును 210 దేశాలలోని పేదవారికి సేవలందించడానికి ఉపయోగిస్తారు. క్లబ్ అధ్యక్షులు వెంకటరమణ గారు మాట్లాడుతూ ఇలాంటి మంచి కార్యక్రమానికి నా వంతుగా నా తండ్రి గారైన స్వర్గీయ శ్రీ గొంది బుచ్చన్న గారి పేరున ఇవ్వడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సోమగూడెం లయన్స్ క్లబ్ మెంబర్లు కోశాధికారి దూడం మహేష్, లయన్ పాముల దినేష్ లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తనను శాలువాతో సత్కరించినందుకు లయన్స్ క్లబ్ కోరుట్ల వారికి ఆయన ధన్యవాదములు తెలిపారు.