Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

ఆదివారం కొనసాగిన పల్లెప్రగతి కార్యక్రమం

Kasipet Mandal News:-
కాసిపేట మండలంలో ఆదివారం పల్లె ప్రగతి
కార్యక్రమం నాలుగవ రోజులో భాగంగా ముత్యంపల్లి గ్రామంలో రోడ్డుకు ఇరువైపులా ఉన్న గడ్డి, పిచ్చి చెట్లను తొలగించారు. మల్కపల్లి గ్రామంలో ప్లాస్టిక్ వ్యర్ధాలను తొలగించారు. మామిడిగూడ గ్రామంలో డ్రైనేజ్ నాళాలను క్లీన్ చేశారు. కోమటిచేను గ్రామంలో బైపాస్ రోడ్డు ఇరువైపులా పిచ్చి చెత్తను తొలగించారు. బుగ్గగూడెం గ్రామంలో ర్యాలీ నిర్వహించి పరిసరాలను శుభ్రం చేశారు. మండలంలోని ఇతర గ్రామాలలో పారిశుద్ధ్య పనులు నిర్వహించారు. ఆదివారం కూడా సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు ప్రత్యేక శ్రద్ధ చూపించి పల్లె ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి తమ వంతు కృషి చేస్తున్నారు.


 బుగ్గగూడెం గ్రామంలో 

మల్కెపల్లి గ్రామంలో

మామిడిగూడా గ్రామంలో 


 ముత్యంపల్లి గ్రామంలో 




Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App