Kasipet Mandal News:-
పల్లె ప్రగతి చివరిరోజు కార్యక్రమంలో భాగంగా
కాసిపేట మండలంలోని గ్రామాలలో గ్రామసభ నిర్వహించారు. గ్రామసభలో రెండవ పల్లెప్రగతిలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. చేసిన ఆదాయ వ్యయాలను గ్రామ సభలో చదివి వినిపించారు. గ్రామస్తులు స్వచ్ఛతను పాటిస్తూ గ్రామాలను స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్దడానికి సహకరించాలని కోరారు. నేటితోనే ఈ కార్యక్రమం ముగిసిపోలేదని, ప్రజలు నిరంతరం గ్రామాభివృద్ధికి తమ వంతుగా కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామాల సర్పంచులు, ఉప సర్పంచ్లు, గ్రామ స్పెషల్ ఆఫీసర్లు, పంచాయతీ కార్యదర్శులు, వార్డు మెంబర్లు, కో ఆప్షన్ సభ్యులు ప్రజలు పాల్గొన్నారు.