Kasipet News/Pallamguda:-
కాసిపేట మండలం పల్లంగూడా గ్రామపంచాయతీ
పరిధిలోని గోండు గూడ కు చెందిన ధర్ము (49) చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి పోయాడు. పూర్తి వివరాల్లోకి వెళితే చక్రం సోము, మడావి జంగు, ఆత్రం సోము, కుర్స్oగా ధర్ము నలుగురు గురువారం రాత్రి మద్యం మత్తులో కోమటి చేను సమీపంలోని చెరువులో చేపల వేటకు వెళ్లారు. ధర్ము నీటిలోకి వల విసిరే సమయంలో అందులో పడిపోయాడు. దింతో మిగతా ముగ్గురు భయంతో ఇండ్లకు పరుగులు తీశారు. శుక్రవారం దేవాపూర్ పోలీసులకు సమాచారం అందించడంతో వారు చెరువు దగ్గరకి వచ్చి గాలింపు చర్యలు చేపట్టారు. ఎంత వెతికినా ధర్ము ఆచూకీ లభించలేదు. దీంతో శనివారం మళ్లీ గాలింపు చర్యలు చేపట్టనున్నారు.