Irctc తన వినియోగదారులకు హెచ్చరిక జారీ
చేసింది. Irctctour.com అనే నకిలీ వెబ్సైటు irctc పేరుతో ప్రజలను మోసం చేస్తుంది అని తెలిపింది. ఈ నకిలీ వెబ్సైటు వినియోగదారులకు Irctc తరుపున టూరిజం ప్యాకేజీ అందిస్తున్నట్లు తెలుపుతుందని, మోసపూరిత లావాదేవీలు స్వీకరిస్తుందని Irctc ప్రకటించింది. వినియోగదారులు జాగ్రత్తగా ఉండాలని, ఇలాంటి మోసపూరిత వెబ్సైటు భారిన పడవద్దని తెలిపింది. ప్రజలకు ఆన్లైన్ ద్వారా టికెట్, కేటరింగ్ సేవలు అందించే అధికారం ఉన్న ఏకైక Indian Railway website Irctc మాత్రమే అని వినియోగదారులు గుర్తుంచుకోవాలని పేర్కొంది.