Kasipet News/Devapur:-
ఈరోజు పదవి విరమణ పొందిన మల్కెపల్లి
కాంప్లెక్స్ ఉపాధ్యాయులు తుకారాం మరియు నారాయణ గారిని దేవాపూర్ జెడ్పిఎస్ఎస్ స్కూల్లో సన్మానం చేశారు. ఈ సందర్భంగా తోటి ఉపాధ్యాయులు మాట్లాడుతూ వారి శేష జీవితం కుటుంబ సభ్యులతో ఆహ్లాదంగా జీవించాలని కోరుకున్నారు. ఉపాధ్యాయ వృత్తిలో ఇన్ని సంవత్సరాలు చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో మల్కెపల్లి కాంప్లెక్స్ ఉపాధ్యాయులు, దేవాపూర్ కాంప్లెక్స్ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.